: ప్రేమికుడు మోసం చేయడంతో... వరంగల్‌లో పీజీ అధ్యాపకురాలు సూసైడ్
వరంగల్ జిల్లా చిన్నబోయినపల్లిలో పీజీ అధ్యాపకురాలుగా పని చేస్తున్న మమత సూసైడ్ చేసుకుంది. వెంకటరమణ అనే వైద్యుడు, మమత నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. దీంతో వెంకట రమణతో మమతకు గతేడాది నిశ్చితార్థం జరిగింది. అయితే, అతను మరో వివాహం చేసుకోబోతున్నాడని తెలియడంతో మమత పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. వెంకటరమణ వరకట్నం అడగడం కూడా మమత ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ఆమె ఆత్మహత్యతో వెంకటరమణ పరారీలో ఉన్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.