: ఈజిప్టులో బాంబు పేలుడు
ప్రపంచం ఉగ్రదాడులతో ఉలిక్కిపడుతోన్న వేళ.. ఈజిప్టు ఉత్తర ప్రాంతంలోని అల్-అరిష్ నగరం అల్-బహర్ వీధిలో మరో బాంబు పేలుడు సంభవించింది. పోలీసు క్లబ్‌కు సమీపంలో సంభవించిన ఈ బాంబు పేలుడులో ఓ పోలీసు అధికారి సహా ఇద్దరు మరణించారు. మరో భద్రతా అధికారికి గాయాలయ్యాయి. పోలీసు వాహనం అటుగా వెళ్తుండగా బాంబును పేల్చినట్లు ఈజిప్టు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదే ప్రాంతంలో ఈజిప్టు సైన్యం, పోలీసులు 65 మంది ఉగ్రవాదులను హతమార్చిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడ్డారు. బాంబు పేలుడు దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు.