: రోడ్లపై ‘రాయల్’ రాజసం!... గత నెలలో అర లక్ష దాటిన ‘బుల్లెట్’ విక్రయాలు


భారతీయ రహదారులపై ‘రాయల్ ఎన్ ఫీల్డ్’ రాజసం క్రమంగా పెరుగుతోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ బైకంటేనే సంపన్న వర్గానికి చెందిన బైక్ అన్న భావన క్రమంగా దూరమవుతోంది. మధ్య తరగతి వర్గమూ ఈ బైక్ పట్ల ఆసక్తి కనబరుస్తోంది. వెరసి ఈ కంపెనీ తయారుచేస్తున్న ‘బుల్లెట్’ బైకుల విక్రయాలు శరవేగంగా పెరుగుతున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరానికి వీడ్కోలు పలికిన గత నెల (మార్చి)లో బుల్లెట్ బైకుల విక్రయాలు ఏకంగా అర లక్ష దాటాయి. ఈ మేరకు నిన్న రాయల్ ఎన్ ఫీల్డ్ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. గత నెలలో 51, 320 బుల్లెట్ బైకులు విక్రయమయ్యాయని ఆ కంపెనీ ప్రెసిడెంట్ రుద్రతేజ్ సింగ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News