: సబ్బు బిళ్లపై కేసీఆర్ చిత్రం!... కళా నైపుణ్యంతో కేసీఆర్ కు స్వాగతం పలికిన వర్ని వాసి


తెలంగాణ ప్రజల ఏళ్ల నాటి కలను టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాకారం చేశారు. 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని సజీవంగా ఉంచి, సరికొత్త తరహాలో ఉద్యమాన్ని హోరెత్తించిన కేసీఆర్... తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఆవిష్కరించారు. ఈ కారణంగా తెలంగాణ ప్రజలు ఆయనను దేవుడితో సమానంగా ఆరాధిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న నిజామాబాదు జిల్లా పర్యటనకు వెళ్లిన కేసీఆర్ కు... ఆ జిల్లా వర్నీ మండలం వడ్డేపల్లికి చెందిన భిక్కనూర్ గణేశ్ అనే యువకుడు తనదైన రీతిలో స్వాగతం పలికారు. తన కళా నైపుణ్యంతో సబ్బు బిళ్లపై కేసీఆర్ చిత్ర పటాన్ని ఆ యువకుడు రూపొందించాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత తొలిసారి కేసీఆర్ వర్ని మండలం మీదుగా బాన్సువాడకు వెళుతున్న సందర్భంగా తన కళా నైపుణ్యంతో కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించిన సబ్బు బిళ్లను పట్టుకుని గణేశ్ ఆయనకు స్వాగతం పలికాడు.

  • Loading...

More Telugu News