: కేంద్రం నుంచి ఇంకా 13,000 కోట్లు రావాలి: బాబుతో అధికారులు


ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో ఆర్థికశాఖ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థికపరిస్థితిని సీఎంకి అధికారులు వివరించారు. లోటు బడ్జెట్ కు ఉపశమనం కల్గించాల్సిన కేంద్రం నిధుల మంజూరులో అలసత్వం ప్రదర్శిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కేంద్రం కేవలం 3300 కోట్ల రూపాయల నిధులను మాత్రమే విడుదల చేసిందని, ఇంకా 13 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉందని వారు తెలిపారు. దీంతో ఈ నిధుల విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి నిధులు విడుదలయ్యేలా చూడాలని ఆయన భావిస్తున్నారు. కాగా, కేంద్రం తాజాగా కరవు మండలాల్లో సహాయక చర్యల కోసం 140.5 కోట్ల రూపాయలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News