: చావుతో సెల్ఫీ దిగినంత పనైంది!: అటవీ రేంజర్ భయానక అనుభవం


అసోంలోని కజిరంగా పార్కులో అటవీ రేంజర్ చావును తృటిలో తప్పించుకున్న ఘటన చోటుచేసుకుంది. భూమి మీదున్న ఖడ్గమృగాలలో మూడింట రెండొంతులు, ఇతర వన్యప్రాణులు కజిరంగా పార్కులో ఉన్నాయి. దీంతో స్మగ్లర్లు ఇక్కడ వేటాడి జంతువులను చంపేస్తున్నారు. దీంతో అటవీ శాఖ ప్రత్యేకంగా రేంజర్లను నియమించింది. వాహనాలు వాడితే వాటి సౌండుకు స్మగ్లర్లు పారిపోయే ప్రమాదం ఉండడంతో ఓ ఫారెస్ట్ రేంజర్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో అతనికి ఓ ఖడ్గమృగం తారసపడింది. మామూలుగా అయితే అది తప్పుకునేదేమో కానీ, అది పిల్లతల్లి...సాధారణంగా ఇలాంటి ఖడ్గమృగాలకు కోపం ఎక్కువుంటుంది. తమపిల్లలకు ఏమాత్రం హాని కలుగుతుందని భావించినా దాడికి దిగుతుంది. అలాగే రేంజర్ ను చూసిన ఖడ్గమృగం దూసుకొచ్చింది. దీంతో అటవీ రేంజర్ బతుకుజీవుడా అంటూ చెట్టెక్కాడు. అయితే ఖడ్గమృగం తలచుకుంటే ఆ చెట్టును కూల్చి అతని ప్రాణాలు తీయడం పెద్ద కష్టమైన పని కాదు. కానీ పిల్లని రక్షించడమే లక్ష్యంగా ఆ ఖడ్గమృగం నెమ్మదిగా అతనిని ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. ఈ తతంగాన్నంతా దూరంగా ఉండి కెమెరాలో బంధించిన వన్యప్రాణి శాస్త్రవేత్త...ఈ అనుభవం ఎలా ఉంది? అంటూ రేంజర్ ను ప్రశ్నించగా, చావుతో సెల్పీ దిగి వచ్చినట్టుందని సమాధానమిచ్చాడు.

  • Loading...

More Telugu News