: పాకిస్థాన్ బృందం వచ్చింది...ఇక మన బృందం అక్కడికి వెళ్లనుంది!


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి ఘటనపై దర్యాప్తు చేసేందుకు భారత ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం పాకిస్థాన్ వెళ్లనుంది. ఈ దాడిని పాకిస్థాన్ కు చెందిన 'జైష్ ఎ మహ్మద్' ఉగ్రవాద సంస్థ చేసిన పనిగా భారత్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆధారాలను పాకిస్థాన్ కు భారత్ అందజేసింది. అయితే దీనిపై మరింత సమాచారం కోసం దర్యాప్తు బృందాన్ని పంపిస్తామని పాక్ సూచించడంతో భారత్ అంగీకరించింది. దీంతో పాక్ కు చెందిన ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం పంజాబ్ లోని పఠాన్ కోట్ ను సందర్శించింది. ఇక ఈ ఘటనపై తమ దర్యాప్తులో భాగంగా భారత్ కు చెందిన ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం పాకిస్థాన్ ను సందర్శించనుంది. ఈ మేరకు పాకిస్థాన్ కు భారత్ సందేశం పంపింది. దీనిపై స్పందించిన పాక్... భారత్ దర్యాప్తు బృందాన్ని తమ దేశానికి పంపాలనే భారత్ ఆలోచనను స్వాగతిస్తున్నామని తెలిపింది.

  • Loading...

More Telugu News