: సంగీత దర్శకుడు శశిప్రీతమ్ పై దాడి
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శశిప్రీతమ్ పై భానుప్రసాద్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన శశిప్రీతమ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, శశిప్రీతమ్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కాగా, శశిప్రీతమ్, భానుప్రసాద్ మధ్య గతంలో విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ పలు సందర్భాల్లో ఘర్షణకు దిగినట్టు తెలుస్తోంది. శశిప్రీతమ్, భానుప్రసాద్ ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.