: నిరుద్యోగానికి కాంగ్రెసే కారణం, ఉద్యోగాలు సృష్టిస్తాం: కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్
ఎన్నికల సమయంలో ఉద్యోగాలు సృష్టిస్తామని బీజేపీ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని కేంద్ర సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. తమ ప్రభుత్వం ఆ దిశగానే ముందుకు సాగుతోందని అన్నారు. దేశంలో 65శాతం జనాభా 35 సంవత్సరాలలోపు వారే ఉన్నారని, అందుకు తగినట్లుగా పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న నిరుద్యోగానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చినట్లుగానే అతి త్వరలో దేశంలో ఉద్యోగాలు సృష్టిస్తుందని చెప్పారు.