: నేను మెంటలోడిని కాదు, జెంటిలోడిని కాదు: పోసాని కృష్ణమురళీ


‘నేను మెంటలోడిని కాదు... జెంటిలోడిని కాదు.. పోసాని కృష్ణమురళీని’ అని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘పోసాని మెంటల్ కృష్ణానా? లేక జెంటిల్మెనా?’అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘నవ్వొస్తే నవ్వుతా, ఏడుపొస్తే ఏడుస్తా, ఆవేశమొస్తే ఆవేశపడతా... మనిషి లక్షణాలన్నీ నాలో ఉన్నాయి, మానవాతీత లక్షణాలేవీ నాలో లేవు. ఒక ఆర్టిస్ట్ గా ఇష్టపడే అన్ని సినిమాలు చేస్తాను, అయితే, ఆర్టిస్ట్ గా నన్ను నిలబెట్టింది మాత్రం వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘నాయక్’ చిత్రమే. ఆ సమయంలో ఒక సినిమాకు డైరైక్షన్ చేసేందుకు వెళ్లాల్సి ఉంది.. అప్పుడు వినాయక్ ఫోన్ చేసి నాయక్ చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించాలని నన్ను అడిగితే ఓకే చెప్పాను. మొదటి రోజు షూటింగ్ కు వెళ్లాను.. నేను యాక్టింగ్ చేస్తుంటే, వినాయక్ తెగ నవ్వాడు. చోటా కె నాయుడు, ఆయన స్టాఫ్ పెద్దగా నవ్వారు. నా నటన బాగుందని చెప్పి, నా పాత్ర నిడివిని పెంచి, పదమూడు రోజుల పాటు షూటింగ్ చేశారు’ అని పోసాని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News