: ఎండలు ఇంకా మండుతాయి... జాగ్రత్తగా వుండండి!: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా వుండాలని జాతీయవాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్ర ఉపరితలంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఎల్ నినో ప్రభావంతో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఒక డిగ్రీ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతుందని వారు తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల ప్రజలు ఎండల్లో బయటకు వెళ్లకుండా వుండాలని, ఒకవేళ వెళ్లినా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఎండలు మండుతాయని తెలిపింది. అందుకు ఇప్పటి నుంచే ప్రజలు, ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.