: పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో నిబద్ధత చాటుకున్నారు: కేసీఆర్ పై మాజీ సీఎం నాదెండ్ల ప్రశంసలు
తెలంగాణ జల విధానంపై సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయనకు ఒక లేఖ రాశారు. ఈరోజు రాసిన ఆ లేఖలో నాదెండ్ల ఏమన్నారంటే...తెలంగాణ రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ కు విజన్ ఉందన్నారు. జల విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేసీఆర్ తన నిబద్ధతను చాటుకున్నారన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రజలకు తాగునీరు సరఫరా చేయడం అభినందనీయమంటూ ఆ లేఖలో నాదెండ్ల పేర్కొన్నారు.