: ‘బేవాచ్’ సినిమా ఫస్ట్‌లుక్‌లో ప్రియాంక చోప్రా మిస్సింగ్
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ స్టార్ డ్వెయిన్ జాన్సన్‌తో కలిసి ‘బేవాచ్’ సినిమాలో నటించే అవకాశం కొట్టేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ నటిగా మారిపోయిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం అమెరికన్ టీవీ సీరియల్ ‘క్వాంటికో’ షూటింగ్‌లోనూ బిజీబిజీగా ఉంది. ఇటీవలే ‘బేవాచ్’ సినిమా ఫస్ట్‌లుక్‌ను డ్వెయిన్ జాన్సన్ తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. అయితే, డ్వెయిన్ షేర్ చేసిన ఆ పిక్‌లో ప్రియాంక చోప్రా కనబడడం లేదు. ఇతర నటీనటులతో స్లో మోషన్‌లో బీచ్ వద్ద పరుగెడుతూ తీసిన సన్నివేశ ఫోటోను డ్వెయిన్ షేర్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన ఈ పిక్చర్ ను ప్రియాంక చోప్రా తన ట్విట్టర్ ఖాతాలోనూ పెట్టేసింది. కానీ, ఫస్ట్‌లుక్‌లో ప్రియాంక చోప్రా మిస్ కావడం ఆ అమ్మడి ఫ్యాన్స్ కు పెద్ద నిరాశే. ‘బేవాచ్’ సినిమా వచ్చే ఏడాది మే 19వ తేదీన విడుదల కానుంది. ప్రియాంక చోప్రా దీనిలో విలన్ రోల్‌లో కనపడనుంది.