: ‘గాలి’ బెయిల్ కుంభకోణంలో జోక్యం చేసుకోలేం!... తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు


కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ గనుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ కోసం అప్పటి సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించిన పట్టాభిరామారావు కోట్లాది రూపాయలను లంచంగా తీసుకుని పట్టుబడిపోయారు. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది నిందితులకు ప్రత్యేక కోర్టు గతంలోనే బెయిల్ మంజూరు చేసింది. అయితే నిందితుల బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై కొద్దిసేపటి క్రితం విచారణ జరిపిన సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. అంతేకాకుండా ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాను జోక్యం చేసుకోలేనని సుప్రీంకోర్టు చెప్పింది.

  • Loading...

More Telugu News