: కాలిఫోర్నియా ఉద్యోగులకు గంటకు కనీసం 15 డాలర్లు...2022 నుంచి అమలు


అమెరికాలోని కాలిఫోర్నియా లో పనిచేసే ఉద్యోగులకు ఒక గంటకు కనీసం 15 డాలర్లు (సుమారు 995 రూపాయలు) చొప్పున చెల్లించాలంటూ రాష్ట్ర సెనేట్ లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుపై ఏప్రిల్ 4న గవర్నర్ చేయనున్న సంతకంతో ఇది చట్టం కానుంది. అయితే, 2022 సంవత్సరం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చేలా చట్ట ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియలో ఉద్యోగులకు గంటకు 10 డాలర్లు చెల్లిస్తున్నారు. అమెరికాలోని ఉద్యోగులకు అత్యధిక జీతభత్యాలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో కాలిఫోర్నియా, మసాచుసెట్స్ ఉన్నాయి. మసాచుసెట్స్ లో ఉద్యోగులకు కూడా ప్రస్తుతం గంటకు చెల్లించేది పది డాలర్లు.

  • Loading...

More Telugu News