: వేసవిలో 24 గంటల్లోనే శ్రీవారి దర్శనం : టీటీడీ ఈవో


వేసవిలో 24 గంటల్లోనే శ్రీవారిని భక్తులు దర్శించుకునేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈరోజు డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రతి శుక్రవారం ప్రోటోకాల్ అధికారులకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని, సిఫార్సు లేఖలను అనుమతించబోమని అన్నారు. వృద్ధులు, వికలాంగులు, చిన్నారులకు శుక్రవారం ఉదయం పూట దర్శనం రద్దు చేస్తామన్నారు. ఈ నెల 9 నుంచి ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారులకు అర్చకత్వంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మే నెలలో తెలుగు రాష్ట్రాల్లోని 60 కేంద్రాల్లో ‘శుభప్రదం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో 8,9,10వ తరగతులకు చెందిన 23 వేల మంది విద్యార్థులు పాల్గొంటారని సాంబశివరావు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News