: కోర్టుకు హాజరుకాని అంజలి


హీరోయిన్ అంజలి మద్రాస్ హైకోర్టుకు గైర్హాజరయ్యారు. ఇటీవల ఆమె అదృశ్యమైన సమయంలో ఆమె పిన్ని భారతీదేవి కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు అంజలిని నేడు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, ఆమె గైర్హాజరవడంతో కోర్టు పోలీసులను మందలించింది. కాగా, జూన్ మొదటి వారంలో అంజలిని హాజరుపరుస్తామని వారు హైకోర్టుకు తెలిపారు.

  • Loading...

More Telugu News