: నిజానికి మేమిద్దరం స్నేహితులం!: మీట్ బ్ర‌ద‌ర్స్


కొన్ని విషయాలలో మాత్రమే తమ నిర్ణయాలు వేరుగా ఉంటాయి త‌ప్ప, ఆఖరికి గర్ల్ ఫ్రెండ్స్ ను కూడా తాము షేర్ చేసుకున్నామని మీట్ బ్రదర్స్.. మన్మీత్ సింగ్, హర్మీత్ సింగ్ అంటున్నారు. 'మీట్ బ్రదర్స్'గా పేరుగాంచిన వీరిద్ద‌రూ జీవితంలో ఏవీ శాశ్వతంగా ఉండవని త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తూ.. ప‌లు ఆసక్తికర విషయాలను వెల్ల‌డించారు. తాము చాలా విష‌యాల్లో ఒకే తీరుగా ప్రవర్తిస్తామని చెప్పారు. 'నిజానికి మేం ఇద్దరం స్నేహితులం. నిజంగా బ్రదర్స్ అవ్వాల్సిన పనిలేదు' అని చెప్పారు. మన్మీత్‌కు ఓపిక చాలా ఎక్కువని, తనకు కూడా కోపం త్వరగా వస్తుందని హర్మీత్ చెప్పాడు. 2010లో ఓ బాలీవుడ్ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్లుగా కెరీర్‌ను ఆరంభించిన మీట్ బ్రదర్స్ రీమిక్స్ పాటలతో హల్ చల్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News