: రాజ‌స్థాన్‌లో జాకీచాన్ ‘కుంగ్‌ఫూ యోగా’ షూటింగ్


మార్షల్ ఆర్ట్స్ స్టార్ జాకీచాన్ హీరోగా తెరకెక్కుతోన్న ఇండో-చైనీస్ చిత్రం ‘కుంగ్‌ఫూ యోగా’ షూటింగ్ రాజ‌స్థాన్‌ జోధ్‌పూర్‌లోని మెహ్రన్‌గఢ్‌ కోటలో జరుగుతోంది. ఈ సంద‌ర్భంగా జాకీచాన్‌ను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున కోట వద్దకు చేరుకుంటున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ఫరాఖాన్ కొరియోగ్రఫీలో జాకీ చాన్ స్టెప్పులేయనున్నారు. స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ తారలు 'లోఫర్' ఫేమ్ దిశా పాట్నీ, 'అనేకుడు' ఫేమ్ అమైరా దస్తర్ కథానాయికలు కాగా, విలన్ పాత్ర‌ను సోనూ సూద్ పోషిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ శైలిలో సాగే ప్రత్యేక గీతంలో అమైరా దస్తర్, దిశా పాట్నీలతో కలిసి జాకీచాన్ కాలు కదపనున్నారట. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జోధ్‌పూర్ ప్యాలెస్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ జరుగుతుంద‌ని, అక్క‌డ‌ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పాటను మూడు వారాల పాటు చిత్రీకరిస్తారని సోనూ సూద్ చెప్పాడు.

  • Loading...

More Telugu News