: శ్రీజ వివాహ విందుకు అతిరథమహారథులు హాజరు
ప్రముఖ నటుడు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహ రిసెప్షన్ హైదరాబాదులోని పార్క్ హయాత్ హోటల్ లో ఘనంగా జరిగింది. వివాహ రిసెప్షన్ కు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు పలువురు హాజరయ్యారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దర్శకరత్న దాసరి నారాయణరావు, అగ్రనటుడు బాలకృష్ణ సహా యువనటులు, ఇతర సినీ నటులంతా హాజరయ్యారు. వచ్చీపోయే అతిథులతో పార్క్ హయాత్ హోటల్ ముంగిట పండగవాతావరణం నెలకొంది.