: కోహ్లీ అర్ధ సెంచరీ...టీమిండియా 150/2
టీమిండియా చిచ్చరపిడుగు విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ లో మరో అర్ధసెంచరీ నమోదు చేశాడు. విండీస్ పై మరోసారి రాణించిన కోహ్లీ సాధికారిక ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. నెమ్మదిగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ లైన్ దాటిస్తున్నాడు. స్పిన్నర్లను టీమిండియా ఆటగాళ్లు ఆడుకోవడంతో సమి పేసర్లను రంగంలోకి దించాడు. కట్టుదిట్టమైన బంతులతో విండీస్ బౌలర్లు ఆకట్టుకున్నప్పటికీ, బారత బ్యాట్స్ మన్ భారీ షాట్లుకొట్టి అలరించారు. ఈ క్రమంలో కోహ్లీ అర్ధ సెంచరీ చేశాడు. దీంతో 17 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.