: బాలీవుడ్, ప్రముఖులతో కళకళలాడిన వీఐపీ గ్యాలరీ
ముంబైలోని వాంఖడే స్టేడియం వీఐపీ గ్యాలరీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కళకళలాడింది. వెస్టిండీస్-భారత్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ సందర్భంగా బాలీవుడ్ కు చెందిన పలువురు నటులు గ్యాలరీల్లో సందడి చేశారు. నిత్యం పనులతో బిజీగా ఉంటే ముఖేష్ అంబానీ, సహచరులు, సన్నిహితులతో స్టేడియానికి వచ్చారు. క్రికెట్ దేవుడు సచిన్ కుటుంబ సమేతంగా స్టేడియం చేరుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన రాజకీయ ప్రముఖులు కూడా స్టేడియంకు చేరుకోవడం విశేషం. వీరంతా టీమిండియాను ఉత్సాహపరుస్తున్నారు. కాగా, టీమిండియా 16వ ఓవర్ లో రెండో వికెట్ కోల్పోయింది. భారీ షాట్ కు యత్నంచిన రహానే బౌండరీ లైన్ వద్ద బ్రావో పట్టిన అద్భుతమైన క్యాచ్ తో 40 పరుగుల వద్ద అవుటయ్యాడు. దీంతో టీమిండియా 16 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది.