: పదో తరగతి విద్యార్థినులకు డ్రెస్ కోడ్ గా సల్వార్ కమీజ్ ప్రవేశపెట్టాలి: ఎమ్మెల్యే కొండా సురేఖ


పాఠశాల విద్యార్థినులకు పొట్టి దుస్తుల యూనిఫామ్ కు బదులుగా సల్వార్ కమీజ్ ప్రవేశపెట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ డిమాండ్ చేశారు. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం ద్వారా బాలికలపై లైంగిక వేధింపులు, అత్యాచారయత్నాలు జరగకుండా ఉండేందుకు ఆస్కారం ఉందన్నారు. ముఖ్యంగా పదోతరగతి బాలికలకు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా ఉండాలన్నారు. చాలా పాఠశాల్లలో యూనిఫామ్ పొట్టి దుస్తులేనని, ఆ పద్ధతిని మార్చేందుకు సల్వార్ కమీజ్ ను డ్రెస్ కోడ్ గా తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి వారిని పాఠశాల నుంచి డిబార్ చేయాలని, అటువంటి విద్యార్థులకు ఏ పాఠశాలలోను కూడా అడ్మిషన్ ఇవ్వకూడదని అన్నారు. అంతేకాకుండా తోటి మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సురేఖ సూచించారు.

  • Loading...

More Telugu News