: ‘జబర్దస్త్’ టీంకు హుజూరాబాద్ కోర్టు నోటీసులు
ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో ‘జబర్దస్త్’ టీంపై కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ‘జబర్దస్త్’లో గతంలో ప్రసారమైన ఒక ఎపిసోడ్ న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా ఉందంటూ న్యాయవాది అరుణ్ కుమార్ ఈమేరకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు ‘జబర్దస్త్’ టీంకు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ కామెడీ షోపై గతంలో గౌడ విద్యార్థి సంఘం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కల్లుగీత కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా ఓ ఎపిసోడ్ ఉందంటూ నాడు గౌడ విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు.