: అసెంబ్లీలో ఆ విషయంపై గట్టిగా ప్రశ్నించాం: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూములను తక్కువ రేట్లకు కొన్నారని, అక్కడి రైతులను మోసం చేశారని వైకాపా అధినేత జగన్ చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వం రైతులను మోసం చేసిన తీరుపై అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించామని అన్నారు. వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం తమ అనుచరులు, బినామీలకు మాత్రమే భూములు అమ్ముకునేలా చేసిన విషయంపై గట్టిగా ప్రశ్నించినట్లు చెప్పారు. అగ్రిగోల్డ్ విషయంలో బాధితులకు అండగా నిలబడ్డామని జగన్ చెప్పారు. పోలవరం ప్రాజక్టు అవకతవకలను సభలో బయటపెట్టామని ఆయన చెప్పారు. విద్యుత్ తక్కువ రేటుకు అందుబాటులో ఉన్నా ఎక్కువపెట్టి కొన్నారని ఆయన ఆరోపించారు. తాము చేసిన ఆరోపణలు కాగ్ నివేదికతో నిజమని తేలాయని జగన్ పేర్కొన్నారు.