: ఆ పది మంది ప్రలోభాలకు, డబ్బుకు అమ్ముడుపోయారు: జగన్
వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత జగన్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇదేం విధానమని ఆయన ప్రశ్నించారు. లోటస్ పాండ్ లో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ఇచ్చిన బీఫాంపై గెలుపొందిన పది మంది ఎమ్మెల్యేలు టీడీపీకి అమ్ముడుపోయారని అన్నారు. డబ్బు, ప్రలోభాల కోసం వారు పార్టీ మారారని ఆరోపించారు. డబ్బులిచ్చి పార్టీ మార్పించుకున్న టీడీపీ అంతే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేనప్పుడు పార్టీలో ఎలా చేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని, విద్యావంతులెవరూ దీనిని హర్షించరని ఆయన చెప్పారు. ప్రజలు దీనిని గమనించాలని ఆయన సూచించారు. సరైన సమయంలో బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు.