: చంద్రబాబు ధైర్యం చేసి పట్టిసీమ ప్రాజెక్టును కట్టారు!: కేసీఆర్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోలవరం నుంచి రెండు దిశలకు నీళ్లు వెళ్లేలా ప్రాజెక్టు కట్టాలని చెప్పానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఒక పక్క నుంచి విశాఖపట్టణం వెళ్లే దిశగా నీళ్లు మళ్లించుకోవాలని, అలాగే రెండో పక్క నుంచి రాయలసీమలోని తడవైపు నీళ్లు తరలించాలని చెప్పానని అన్నారు. కేవలం ఇవే కాకుండా మధ్య మధ్యలో చిన్న ప్రాజెక్టులు కొన్ని కట్టుకోవాలని కూడా సూచించానని ఆయన చెప్పారు. చంద్రబాబు ధైర్యం చేసి పట్టిసీమ ప్రాజెక్టును కట్టాడని, అందుకు ఆయనను అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. అందుకే చంద్రబాబుతో ఊరికే తకరారు పెట్టుకోవడం ఎందుకని ఇలా సూచించానని, త్వరలోనే చంద్రబాబును కలిసి పలు ప్రాజెక్టులపై ఒప్పందాలు చేసుకుంటానని కేసీఆర్ చెప్పారు. రైతులు ఎక్కడి వారైనా రైతులేనని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News