: హైదరాబాద్ కు సమీపంలో రెండు జలాశయాలు


హైదరాబాద్ ప్రజలకు తాగునీటి అవసరాల కోసం రెండు జలాశయాలు ఉండాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని రాచకొండ గుట్టల్లో 20 టీఎంసీల సామర్థ్యంతో ఒక జలాశయం, అదే సామర్థ్యంతో శామీర్ పేట వద్ద మరో జలాశయం నిర్మిస్తామని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షపాతం ఎక్కువ ఉన్నా, ఈ జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వలసలు పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇక్కడ ఆరు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రస్తుత సీజన్ లో ర్యాలి వాగు, మత్తడి వాగు పూర్తి చేస్తామని, గొల్లవాగు, నీలివాయి, జగన్నాథపూర్ ప్రాజెక్టులు పూర్తి కావాలన్నారు. 2018 నాటికి కొమురం భీం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News