: న్యాయం దక్కదన్న స్థిర నిర్ణయంతోనే ఉద్యమ బాట!... పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభించిన కేసీఆర్


ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం దక్కదన్న స్థిర నిర్ణయంతోనే ఉద్యమంలోకి దూకానని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో తాను ఉద్యమంలోకి దూకే ముందు నాడు ఉన్న పరిస్థితులను ఆయన ప్రస్తావించారు. పలు కీలక సమస్యలపై ఎన్ని లేఖలు రాసినా నాటి పాలకుల నుంచి స్పందన కరవైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ బషీర్ బాగ్ లో జరిగిన ఉద్యమంపై నాటి చంద్రబాబు సర్కారు జరిపిన కాల్పులతో... ఇక తెలంగాణకు న్యాయం దక్కదని నిర్ధారించుకున్నానన్నారు. వెనువెంటనే అప్పటిదాకా తనకున్న అన్ని రాజకీయ పదవులను త్యజించి తెలంగాణ ఉద్యమంలోకి దూకానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News