: కడపకు ట్రూజెట్ విమాన సర్వీసులు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపకు 'ట్రూజెట్' విమాన సర్వీసులు ప్రారంభించనుంది. వచ్చే నెల 8 నుంచి హైదరాబాద్-కడప, తిరుపతి-కడపల మధ్య ఈ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ట్రూజెట్ సంస్థ ఒక ప్రకటన చేసింది. ‘ట్రూజెట్’కు మూడో విమానం ఏటీఆర్-72 అందుబాటులోకి రావడంతో కొత్త సర్వీసులను ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ మార్గాల్లో విమాన సర్వీసులు నడుపుతున్న ఏకైక విమానయాన సంస్థ తమదేనని ట్రూజెట్ మేనేజింగ్ డైరెక్టర్ వంకాయలపాటి ఉమేష్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News