: ఆ మహిళలకు శిక్ష వేయాలి: డొనాల్డ్‌ ట్రంప్


అమెరికా అధ్యక్ష పదవి రేసులో తీవ్ర‌ పోటీనిస్తున్న‌ రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అబార్షన్లు చేయించుకునే మహిళలకు శిక్ష విధించాలన్నారు. అబార్షన్లు పరిపాటిగా మారుతున్నాయని, వాటిని నియంత్రించాలంటే ఆ మహిళలకు ఎంతో కొంత శిక్ష పడాలని చెప్పారు. అయితే ఆయన ఏ శిక్ష వేయాల‌నే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. విస్కాన్సిన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రిస్‌ మాథ్యూతో చర్చ సందర్భంగా ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గర్భస్రావాలను నిషేధించాలని పేర్కొన్నారు. అబార్షన్లను మీరు పూర్తిగా రద్దు చేయాలని అనుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన అలా స్పందించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ గమనించాలని, వాటిని తలుచుకుంటేనే భయంకరంగా, చెత్తగా ఉన్నాయంటూ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News