: తలసాని సాయి యాదవ్ పై పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు
విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పరుచూరి రామకోటేశ్వరరావుపై బెదిరింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు తలసాని సాయి యాదవ్ పై కేసు నమోదైంది. రామకోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు సాయి యాదవ్ పై ఐపీసీ సెక్షన్లు 384, 342 కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో తన కొడుకు తప్పేమీ లేదని, అసలు రామకోటేశ్వరరావుపై తన కొడుకు బెదిరింపులకు పాల్పడలేదని సాక్షాత్తు మంత్రి తలసాని వివరణ ఇచ్చిన కొద్దిసేపటికే పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.