: బంగ్లా మాజీ ప్రధానికి అరెస్టు వారెంట్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత ఖలీదా జియా అరెస్టుకు స్థానిక కోర్టు వారెంట్ జారీ చేసింది. గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల సమయంలో ఓ బస్సుకు నిప్పుపెట్టిన ఘటనపై స్థానిక మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా బేగం ఆధ్వర్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా జత్రబరి ప్రాంతంలో బంగ్లా నేషనల్ పార్టీ కార్యకర్తలు ఓ బస్సుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 29 మంది గాయపడ్డారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఆమె అరెస్టుకు వారెంట్ జారీ చేసింది.