: యూఎస్ యుద్ధ విమానాన్ని తామే కూల్చేశామంటున్న తాలిబన్!
యూఎస్ యుద్ధవిమానాన్ని తామే కూల్చేశామని ఉగ్రవాద సంస్థ తాలిబన్ ప్రకటించింది. విమానంలోని వారంతా మృతిచెందారని తెలిపింది. అయితే ఈ విమాన ప్రమాద ఘటన గురించి అంతకు ముందే పెంటగాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ఘనిస్థాన్ లోని బగ్రామ్ ఎయిర్ ఫీల్డ్ నుంచి టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో యూఎస్ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని, రాత్రి 8:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పెంటగాన్ తెలిపింది. సంకీర్ణదళాలు ప్రమాదస్థలిని స్వాధీనంలోకి తీసుకున్నాయని, ప్రమాదానికి కారణాలు అన్వేషిస్తున్నామని పెంటగాన్ మీడియా సెక్రటరీ పీటర్ కుక్ తెలిపారు.