: దంతెవాడలో పంజా విసిరిన మావోలు...ఏడుగురు జవాన్లు మృతి


ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో మావోయిస్టులు పంజా విసిరారు. దంతెవాడ నుంచి మైలవరం వెళ్తున్న సీఆర్పీఎఫ్ వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చివేశారు. దీంతో వాహనం నుజ్జునుజ్జైంది. పేలుడు ధాటికి రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడింది. ఈ ఘటనలో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల ఏరివేతలో సీఆర్పీఎఫ్ దళాలు ఈ మధ్య కాలంలో గణనీయమైన పురోగతి సాధించాయి. దీంతో వారిపై మావోలు మాటువేసి దాడికి పాల్పడ్డారు.

  • Loading...

More Telugu News