: డివిజన్ అడిగిన జగన్...కుదరదన్న యనమల...మూజువాణి ఓటింగుతో ఆమోదం!


ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటితో ముగిశాయి. ప్రశ్నలు, సమాధానాలు, నిలదీతలు, ఎద్దేవాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో దద్దరిల్లిన శాసనసభ నిరవధిక వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ ఓటింగ్ కు పట్టుబట్టారు. దీంతో డివిజన్ కోసం ప్రతిపాదించవచ్చు కానీ, ఓటింగ్ అడిగే అవకాశం ప్రతిపక్షానికి లేదని, స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయమని మంత్రి యనమల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సభ నియమ నిబంధనలను స్పీకర్ కోడెల శాసనసభలో చదివి వినిపించారు. దీంతో ఓటింగ్ నిర్వహించకుండానే ద్రవ్య వినిమయ బిల్లును మూజు వాణి ఓటుతో ఆమోదించి, వైఎస్సార్సీపీ నిరసనల మధ్య శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.

  • Loading...

More Telugu News