: మ‌రో చిక్కులో హృతిక్ రోషన్.. లీగల్ నోటీసుల వ‌ర‌కు తీసుకెళ్లిన ట్వీట్


బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ త‌న మాజీ ప్రియురాలు కంగనా రనౌత్ తో బ్రేక‌ప్ అయి.. ఆమె నుంచి లీగ‌ల్ నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ చిక్కులోంచి బ‌య‌ట‌ప‌డ‌క ముందే హృతిక్ రోషన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. క్రైస్తవమతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు తాజాగా మ‌రో లీగల్ నోటీసు అందుకున్నాడు. ట్విట్ట‌ర్ లో పోప్ ఫ్రాన్సిస్ పై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని హృతిక్ రోషన్ కు క్రిస్టియన్ సెక్యులర్ ఫోరం లీగల్ నోటీసు పంపింది. తమ మతాధిపతిని అవమానించడం ద్వారా క్రైస్తవుల మనోభావాలను, విశ్వాసాలను ఆయన దెబ్బతీశారని పేర్కొంటూ 295ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చింది. కంగనా రనౌత్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ హృతిక్.. త‌న‌ ట్వీట్‌లో పోప్ పేరు ప్రస్తావించాడు.

  • Loading...

More Telugu News