: ఏపీలో 3 వేల కొత్త ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి!


ఏపీఎస్ఆర్టీసీకి చంద్రబాబు సర్కారు కొత్త జవ సత్వాలు ఇచ్చింది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం చాంబర్ లో చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా కాలం చెల్లిన బస్సులతో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన చంద్రబాబు ముందు ఏకరువు పెట్టారు. సాంబశివరావు వాదనను సాంతం విన్న చంద్రబాబు ఆర్టీసీకి బంపరాఫర్ ఇచ్చారు. ఉన్న పళంగా కాలం చెల్లిన బస్సులను పక్కన పడేసి కొత్తగా 3 వేల బస్సులను కొనుగోలు చేసుకోవాలని అనుమతి ఇచ్చారు. ఇందుకోసం అవసరమయ్యే నిధులను సమకూరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News