: రేపటితో తేలనున్న హరీశ్‌రావత్ భవితవ్యం, నేడు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వాదనలు
ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై స్టే విధిస్తూ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ ను ఈ నెల 31లోగా శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలను కూడా బల నిరూపణలో పాల్గొనాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో రేపు ఉదయం 11 గంటలకు ఉత్తరాఖండ్ శాసనసభలో హరీశ్‌రావత్ బలనిరూపణ కార్యక్రమం ఉంటుంది. అనంతరం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హరీశ్‌రావత్ కొనసాగడం లేదా రాష్ట్రపతి పాలన.. ఏదనేది తేలిపోనుంది. అయితే, హైకోర్టు విధించిన బలనిరూపణ అంశంపై కేంద్ర ప్రభుత్వం సవాలు విసిరింది. ఈ విషయమై హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి నేడు వాదనలు వినిపించనున్నారు.