: విపక్షానికి చంద్రబాబు బంపరాఫర్!... ఇసుక అక్రమార్కులను పట్టుకోండని పిలుపు


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం విపక్షం వైసీపీకి బంపరాఫర్ ఇచ్చారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని పట్టుకుని అప్పగించాలని ఆయన విపక్ష సభ్యులకు సూచించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెజ్ చివరి రోజు సమావేశాల్లో భాగంగా ఉచిత ఇసుకపై చర్చలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ...ఉచిత ఇసుక అమలుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఊకదంపుడు విమర్శలు మాని విపక్ష సభ్యులు కూడా ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. విపక్ష సభ్యులు పట్టించే ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇసుకను అక్రమంగా తరలించే వాహనాల డ్రైవర్లతో పాటు ఆయా వాహనాల యజమానులపైనా కేసులు పెడతామని చంద్రబాబు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News