: రిహార్సల్స్ చేస్తుండగా స్పృహ తప్పిన బాలీవుడ్ నటి రిచా చద్దా


ముంబయిలో బాలీవుడ్ నటి రిచా చద్దా డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తుండగా కళ్లు తిరిగి కిందపడిపోయింది. లక్నోలో జరగనున్న ఒక డ్యాన్స్ షోలో పాల్గొనే నిమిత్తం రిచా డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. దాంతో వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. లోబీపీ కారణంగా ఆమె కింద పడిపోయిందని, మితిమీరిన డైటింగ్, తీరిక లేకుండా పనిచేయడంతో ఒత్తిడి కారణంగా బీపీ లెవెల్స్ పడిపోయాయని వైద్యులు చెప్పారు. మూడు గంటల పాటు చికిత్స అందించిన అనంతరం రిచాను డిశ్చార్జి చేశారు. అయితే, లక్నో కార్యక్రమంలో ఆమె పాల్గొనడం లేదని రిచా సన్నిహితులు చెప్పారు. కాగా, 2008లో 'ఓయే లక్కీ! లక్కీ ఓయే' చిత్రం ద్వారా ఆమె బాలీవుడ్ లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న రెండు బాలీవుడ్ చిత్రాల షూటింగ్ లు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News