: మయన్మార్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సూచీ మాజీ డ్రైవర్ హితిన్ క్యా
మయన్మార్ అధ్యక్షుడిగా నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ మాజీ డ్రైవర్, ప్రధాన అనుచరుడు హితిన్ క్యా(69) ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నైపిడాలోని పార్లమెంట్‌లో హితిన్ క్యా, ఇద్దరు ఉపాధ్యక్షులతో కలిసి ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఏప్రిల్ 1న ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ఆర్మీ కొత్త రాజ్యాంగం వల్ల సూకీ అధ్యక్షురాలయ్యే అవకాశం కోల్పోవడంతో హితిన్ క్యాను అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. చారిటబుల్ సంస్థ నిర్వహణలో సూకీకి హితిన్ క్యా సహకారం అందిస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీ భారీ విజయం సాధించింది. దీంతో మయన్మార్‌లో 54 ఏళ్ల మిలిటరీ పాలనకు ఇటీవల స్వస్తి పలికిన విషయం తెలిసిందే. దశాబ్దాల తర్వాత అక్కడ తొలిసారిగా గతేడాది నవంబర్‌లో సాధారణ ఎన్నికలు జరిగాయి.