: కాగ్ నివేదికను ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం


కాగ్ నివేదికను ఏపీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, స్థానిక సంస్థలు, రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఖాతాలపై ఈ నివేదికను ప్రవేశపెట్టారు. 2014-15లో రెవెన్యూలోటు రూ.24,194 కోట్లు, ద్రవ్యలోటు రూ.31,717 కోట్లు, ఎఫ్ఆర్బీఎం చట్టం సూచించిన మూడు శాతం పరిమితికి రెట్టింపు లోటు ఉందని, మొత్తం 6.10 శాతం లోటు నమోదైందని, శాసనపరమైన సాధికారిత లేకుండా రూ.13,134.68 కోట్లు అదనపు వ్యయం చేశారని, కాగ్ నివేదికలో పేర్కొంది.

  • Loading...

More Telugu News