: ఓటింగ్ కు 8 మంది ఎమ్మెల్యేలు వస్తారా!... వైసీపీ విప్ పై ఉత్కంఠ!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్ జరగనుంది. ఈ ఓటింగ్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సాధారణ పరిస్థితుల్లో అయితే, ఈ విషయంపై అంతగా చర్చ జరగదు. తన పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార పార్టీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఓటింగ్ కు హాజరుకావాలని విప్ జారీ చేశారు. ఒకవేళ ఆ 8 మంది ఎమ్మెల్యేలు నేటి ఓటింగ్ కు హాజరుకాని పక్షంలో వారిపై చర్యలకు జగన్ స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ ఓటింగ్ కు హాజరైతే, ఆ ఎమ్మెల్యేలు ఎవరి పక్షాన నిలబడతారన్న విషయం కూడా ఆసక్తికరంగా మారింది. వెరసి నేటి ఏపీ అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.