: గుంటూరులో ఘోరం...ప్రేమికుడే అఘాయిత్యానికి ఒడిగట్టాడు!


సమాజంలో ఎంతో మంది అమ్మాయిలను ప్రేమ కాటేస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన యువతిపై ఆమె ప్రియుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే...పిడుగురాళ్లకు చెందిన ఓ యువతి గోతాముల కంపెనీలో పనిచేస్తోంది. ఏడు నెలల క్రితం ఆమెకు ఆటోడ్రైవర్ రహీంతో పరిచయమైంది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం పెద్దలకు తెలియడంతో మతాలు వేరు కావడంతో వీరి వివాహానికి అభ్యంతరం చెప్పారు. దీంతో వారి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో రహీంకు పెద్దలు వివాహం నిశ్చయించారు. దీంతో తన వివాహానికి ఆమె అడ్డం వస్తుందని భావించిన రహీం స్నేహితులతో ప్లాన్ వేశాడు. పథకం ప్రకారం ఓ రెస్టారెంట్ లో స్నేహితులతో మద్యం తాగాడు. కంపెనీలో విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న యువతిని సాయంత్రం 7 గంటల సమయంలో మార్గమధ్యంలో అడ్డగించి ఆటో ఎక్కించుకుని దేవరంపాడు పొలాలవైపు తీసుకెళ్లారు. అంతా తెలిసిన వారే కావడంతో ఆమెకు ఏ అనుమానం రాలేదు. తర్వాత నిర్మానుష్యమైన చోటుకు వెళ్లాక కానీ వారి కుట్ర ఆమెకు అర్థం కాలేదు. ఆమెను నానా దుర్భాషలాడుతూ రహీం, అతని స్నేహితులు రషీద్, వెంకటేశ్వర్లు, వెంకటేష్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి బారినుంచి తప్పించుకున్న యువతి కుటుంబ సభ్యులకు జరిగింది వివరించింది. దీంతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News