: జ్ఞానంలో బ్రాహ్మణుడ్ని...ఐశ్వర్యంలో వైశ్యుడ్ని...పౌరుషంలో రెడ్డిని: బాలకృష్ణ


"జ్ఞానంలో బ్రాహ్మణుడ్ని...ఐశ్వర్యంలో వైశ్యుడ్ని...పౌరుషంలో రెడ్డిని...అన్నీ కలగలిసి బాలకృష్ణను" అంటూ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పిన డైలాగులు తెనాలి వాసులను అలరించాయి. ఉగాదిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీలను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలయ్యకు ఘన స్వాగతం పలికిన రైతులు, ర్యాలీగా పోటీల ప్రాంగణానికి తీసుకెళ్లారు. ఆ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, తెలుగు సంప్రదాయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. సంప్రదాయ ఎడ్ల బండ్ల పోటీలను ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. తాను నటించిన చాలా సినిమాల్లో ఎడ్లబండ్ల పందాల్లో పాల్గొన్నానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News