: ప్రభాస్ ను ట్విట్టర్ లోకి తీసుకురావచ్చుగా, రానా?: కేటీఆర్ ట్వీట్
జాతీయ ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’ ఎంపిక కావడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘బాహుబలి’ చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు. దర్శకుడు రాజమౌళి, నటుడు దగ్గుబాటి రానా, హీరోయిన్ తమన్నా, శోభూల పేర్లను ప్రస్తావిస్తూ అభినందనలు తెలియజేశారు. అదే ట్వీట్ లో... హీరో ప్రభాస్ ను ట్విట్టర్ లోకి తీసుకువచ్చేలా చేయమంటూ రానాకు కేటీఆర్ నోట్ పెట్టారు. కాగా, జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన ‘బాహుబలి’పై సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్న విషయం తెలిసిందే.