: అశ్వినా? నెహ్రానా? అన్నది అనవసరం...బంతిని బాదడమే లక్ష్యం: క్రిస్ గేల్ 'మాటల' ఆట షురూ
భారత్ తో గురువారం జరగనున్న టీ20 సెమీఫైనల్ మ్యాచ్ కోసం వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ ఇప్పట్నుంచే గేమ్ ప్రారంభించాడు. మాటలతో టీమిండియాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. గేల్ కు టీమిండియాలో చాలా మంది అభిమానులున్నారు. వీరందరికీ గేల్ గురించి బాగా తెలుసు. అదే సమయంలో గేల్ గురించి కూడా వీరికి బాగా తెలుసు. షాట్లు ఆడడంలో గేల్ ప్రతిభను అతని ఐపీఎల్ సహచరులంతా మెచ్చుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పై విజయమే లక్ష్యంగా బరిలో దిగుతానని అన్నాడు. ధోనీ గురించి తెలుసు కనుక తనపై అశ్విన్ ను ప్రయోగిస్తాడని గేల్ పేర్కొన్నాడు. అయితే టీమిండియాలో అశ్విన్ తో పాటు నెహ్రా కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పిన గేల్, వారిద్దరూ కొత్త బంతిని పంచుకునే అవకాశం ఉందని ధోనీ నిర్ణయాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. అయితే తనకు బౌలర్ ఎవరన్నది అప్రస్తుతమని, బౌలర్ ఎవరైనా బంతి బౌండరీని దాటించడమే తన లక్ష్యమని చెప్పాడు. అదే సమయంలో టీమిండియాపై ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో తమకు బాగా తెలుసని గేల్ అభిప్రాయపడ్డాడు.