: గేమింగ్ ప్రియుల కోసం.. లుంబినీ పార్కులో గేమింగ్ జోన్!
హైదరాబాద్ లోని లుంబినీ పార్క్ లో గేమ్స్ కోసం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పర్యాటకులను, గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేయనున్నారు. లేజర్ షో బిల్డింగ్ లోని సెల్లార్ లోను, మొదటి అంతస్తులోను ఈ గేమింగ్ జోన్ ఏర్పాటు నిమిత్తం హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) రూ.73 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియ ఇటీవలే పూర్తయింది. ఈ ప్రాజెక్టును హెచ్ఎండీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించాల్సి ఉంది. వచ్చే నెలలో కమిటీలో చర్చించి, ఆమోద ముద్ర పడిన తర్వాత గేమింగ్ జోన్ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టనున్నట్లు సమాచారం. కాగా, గేమింగ్ జోన్ లో ఉండే గేమ్స్ విషయానికొస్తే... వీఏఆర్ పెయింటింగ్ బాల్, స్మాష్ క్రికెట్, ట్విలైట్ బౌలింగ్, ఫింగర్ కోస్టర్, స్మార్ట్ అక్రెడ్, డోడ్జ్ బాల్ తో పాటు ఫిషింగ్ జోన్లు కూడా ఉండనున్నట్లు సమాచారం.