: ఇంటికో ఉద్యోగం ఏ ప్రభుత్వం ఇవ్వలేదు : సీఎం కేసీఆర్


ఇంటికో ఉద్యోగం అనేది ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ద్రవ్యవినిమయ బిల్లుపై టీ అసెంబ్లీలో ఆయన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఇంటికో ఉద్యోగం అనే హామీని తామెప్పుడూ ఇవ్వలేదని, ఇటువంటి హామీని తెలంగాణ రాష్ట్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేపడతామన్నారు. ఇప్పటికే 24,500 ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. పదివేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు, మరో వెయ్యి ఉద్యోగాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. 2019-20 నాటికి తెలంగాణ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లకు చేరుతుందని కేసీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News